‘ఓజీ’ సినిమా చూసిన చిరంజీవి.. తమ్ముడి ప్రశంసలు.

మెగా స్టార్ చిరంజీవి ‘ఓజీ’ సినిమాను థియేటర్‌లో చూసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌తో మారింది. ఇక ఈ వీడియోలో చిరంజీవి, రామ్ చరణ్ వంటి ప్రముఖులు పవన్ కళ్యాణ్‌తో కలిసి సినిమా చూస్తున్న దృశ్యాలు కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకోంది. అదే విధంగా ఈ సినిమా పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మా కుటుంబంతో కలిసి ‘OG’ సినిమా చూశాను. ఈ సినిమాలో ప్రతి బిట్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. సరైన భావోద్వేగాలను నిలుపుకుంటూనే హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా అద్భుతంగా తీసిన అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ చిత్రం ఇది. అలాగే ఈ సినిమా దర్శకుడు సుజిత్‌ (@sujeethsign) పనితీరు అద్భుతం మొదటి నుంచి చివరి వరకు దర్శకుడు సినిమాను అసాధారణ రీతిలో ఊహించారు. తెరపై కల్యాణ్ బాబును చూసి చాలా గర్వంగా అనిపించింది. తన స్వాగ్‌తో సినిమాను నిలబెట్టి, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పండుగను అందించారు‘‘ అంటూ చిరు తెలిపారు.

అలాగే ‘ఓజీ’ సినిమా, సుజీత్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ యాక్షన్ డ్రామా గా, విడుదల రోజే భారీ విజయాన్ని సంపాదించింది. బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లోనే ₹200 కోట్ల క్లబ్ లో చేరడం, మొదటి రోజు భారీ వసూళ్లు సాధించడం వంటి రికార్డులు ఈ మూవీకి మరింత గుర్తింపు తెచ్చాయి.

అయితే సినిమా విజయంతో పాటు, టికెట్ ధరల పెంపు విషయంలో చర్చలు రేకెత్తాయి. తెలంగాణలో టికెట్ ధరలను పెంచేందుకు ఇవ్వబడిన జీవోని తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.