ఓటరు జాబితా సవరణ గడువు పెంచాలి

ఓటరు జాబితా సవరణ గడువు పెంచాలి ఓటరు జాబితా సవరణ గడువు పెంచాలి
ఓటరు జాబితా సవరణ గడువు పెంచాలి

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొమ్రాస్పేట్ మండల పరిధి బోట్లవాని తండా గ్రామపంచాయతీ బూత్ నంబర్ 195 లో ప్రత్యేక ఓటర్ జాతీయ సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం నిర్వహించారు.కొడంగల్ మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి పిలుపు మేరకు బొమ్రాస్పేట్ మండల బీఆర్‌ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు నెహ్రూ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఓటర్ జాతీయ సమగ్ర సవరణ గడువును మరికొంత కాలం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.వలస వెళ్లిన మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాలలో ఉన్న స్థానిక ఓటర్లు ఈ జాతీయ సమగ్ర సవరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తండావాసులను కోరారు.బీఆర్‌ఎస్ పార్టీ తరఫున నియమితులైన బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) ప్రతి బీఎల్ఓ నిర్వహించే ప్రక్రియలో చురుకుగా భాగస్వాములు కావాలని సూచించారు.అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగేలా కొత్త ఓటర్ల నమోదు వివరాల సవరణ పారదర్శకంగా జరిగేలా సహకరించాలన్నారు.ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని ఏ ఒక్క అర్హుడు కూడా అన్యాయానికి గురికాకుండా ప్రతి ఓటు హక్కు పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రతి రాజకీయ కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి నాయక్, బోట్లవాని తండా యువజన సంఘ అధ్యక్షుడు సూర్య నాయక్, బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకులు నాని,రాజు నాయక్,వినోద్,సునీల్ పాల్గొన్నారు.