షాద్‌నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అందె మోహన్
హిందూ శ్మశాన వాటికలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
షాద్‌నగర్‌లో బోర్ ఏర్పాటు.. స్థానికుల హర్షం
ప్రజల అవసరాలను గుర్తించి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని హిందూ శ్మశాన వాటికలో నెలకొన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. శ్మశాన వాటికలో నీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించిన స్థానిక నాయకులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అందె మోహన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ బసవప్ప, వార్డు కౌన్సిలర్ బచ్చలి నరేష్‌ల సమన్వయంతో ఆదివారం హిందూ శ్మశాన వాటికలో బోర్ ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో ఇకపై అంత్యక్రియలకు వచ్చే ప్రజలకు అవసరమైన నీటి సౌకర్యం అందుబాటులోకి రానుంది. శ్మశాన వాటిక వంటి ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని, నీటి సమస్య పరిష్కారంతో ప్రజలకు కొంత ఊరట లభించిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి, వాటికి తక్షణ పరిష్కార మార్గాలు చూపుతున్న అందె మోహన్‌తో పాటు మున్సిపల్ చైర్మన్ బసవప్ప, వార్డు కౌన్సిలర్ బచ్చలి నరేష్‌లకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఖానుగు అనంతయ్య, కొండ యాదయ్య, కొండ సత్తయ్య, చౌలా రవి, భూషం నరేష్, మంగా శేఖర్, భూషం చిన్న, హబీస్, నౌశద్, అబూ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. “ప్రజా సమస్యే లక్ష్యం.. పరిష్కారమే ధ్యేయం” అనే సామాజిక దృక్పథంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు సాగడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
బోర్ ఏర్పాటు పూర్తికావడంతో శ్మశాన వాటికకు నీటి సౌకర్యం అందుబాటులోకి రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు