పార్టీలకు అతీతంగా గ్రామ కమిటీల ఏర్పాటు.
యువత పోరాటంలోకి వచ్చేవిధంగా జేఏసీ నేతల కృషీ.
రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 86 ఎకరాలను ఏకో టౌన్ పేరుతో జీహెచ్ఎంసీ కి కేటాయిస్తూ జీవో ఆర్టీ నెంబర్ 641 ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే . దీనిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ,కార్మిక, విద్యార్థి, కులసంఘాలతో సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ (SDVP JAC) ని ఏర్పాటు చేసి మొదటి గా కొత్తూరు మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ తర్వాత స్తానిక శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు లకు వినతి పత్రాలు అందజేశారు.. ఈ ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా ఉదృతం చేయాలని జేఏసీ తీర్మానించి, క్షేత్ర స్థాయిలో కార్యాచరణకు శ్రీకారం చుట్టారు… దీనిలో భాగంగా సిద్దాపూర్ గ్రామంలో మరియు కోడిచెర్ల తండాలో పార్టీలకు అతీతంగా ప్రజలతో సమావేశాలు నిర్వహించి గ్రామ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ మూడావత్ రాంబాల్ నాయక్, కన్వీనర్ పినపాక ప్రభాకర్, కో ఆర్డినేటర్ తిరుమలయ్య లు పాల్గొని పోరాటానికి సంబంధించిన సూచనలు చేసి ప్రజలనుంచి వచ్చిన సందేహాలను నివృతం చేశారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధాపూర్ డంపింగ్ యార్డు రద్దు కావాలంటే పార్టీలకు అతీతంగా ప్రజలు ఉద్యమంలోకి స్వచ్ఛందంగా రావాలని , యువత ముఖ్య భూమిక పోషించాలని కోరారు.. ఈ రోజు రాజకీయాలు చేసేవాళ్ళు గాని రాజకీయవార్టీల మాటలు వినే వాళ్ళు గాని ఆలోచన చేయాల్సింది ముందు మన గ్రామం ఉంటేనే కదా ఈ పార్టీలు గ్రామమే భవిష్యత్లో కనుమరుగైతుంటే, మన జీవితాలే ప్రశ్నార్థకంగా మారుతుంటే ఇంకా ఈ పార్టీల మాయ మాటలు నమ్మిదని అందరూ ఐక్యంగా ఒకటే లక్ష్యం తో డంపింగ్ యార్డు రద్దు అయ్యేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఇకనుండి జరిగే దశల వారీ ఆందోళనలో కేవలం జేఏసీ జెండాలు, జేఏసీ కండువాలు తప్ప ఏ పార్టీ జెండాలు కండువాలు లేకుండానే అందరం కలిసి విజయం సాధించాలని తెలిపారు..
అనంతరం గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్దాపూర్ గ్రామ అధ్యక్షులు యెల్లం రాజేందర్, ఉపాధ్యక్షులు కే సురేష్, ఎన్ మల్లేష్, ఏ శ్రీను, కే కార్తీక్, రెడ్యా నాయక్, ప్రధాన కార్యదర్శి గన్నోజు శ్రీధర్, సహాయ కార్యదర్శులు జి ప్రశాంత్, గుంటి శివ, టి వంశీ, ధర్మా, సబావత్ రాజేష్, కోశాధికారి చరణ్ మరియు కార్యవర్గ సభ్యులు లక్ష్మమ్మ , యాదమ్మ, అమృతమ్మ మరియు 20 మంది యువకులను నియమించారు..
అలానే కోడిచెర్ల తండా గ్రామ కమిటీ సలహా దారులు సంతోష్ నాయక్, బిత్యా నాయక్, అధ్యక్షులు పి శంకర్ నాయక్, ఉపాధ్యక్షులు సూర్య నాయక్, కే కుమార్, ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయక్, సహాయ కార్యదర్శి జే కుమార్ , బసు నాయక్, ప్రచార కార్యదర్శి దాస్య నాయక్, కో ఆర్డినేటర్ ప్రవీణ్ నాయక్ , కోశాధికారి తావుర్యా, కార్య వర్గ సబ్యులు రాజు నాయక్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిద్ధాపూర్ గ్రామ సర్పంచ్ విశ్లావత్ బాసు, డిప్యూటీ సర్పంచ్ దొబ్బల యాదయ్య, కోడిచెర్ల తండా సర్పంచ్ శ్రీను నాయక్, డిప్యూటీ సర్పంచ్ సంతోష్ నాయక్, సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ (SDVP JAC) నాయకులు బొజ్జ శ్రీనివాస్ రెడ్డి, వడ్డే బాలయ్య, గుని మహేష్, రజిత, రవీందర్, శ్రీకాంత్, అర్జునప్ప మరియు గ్రామాల ప్రజలు యువకులు పాల్గొన్నారు