బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎల్బీనగర్ నియోజకవర్గం సీనియర్ బి.ఆర్.ఎస్ నాయకులు, భరత్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మామిడి రామచందర్ అన్నారు. మంగళవారం ఎల్బీనగర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మామిడి రామచంద్ర మాట్లాడుతూ మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు గౌడ సంఘం నాయకులు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు..
సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు కృషి చేయాలి