ఆఫ్ఘనిస్థాన్‌లో 6.3 తీవ్రత భూకంపం: 20 మంది మృతి, 350కిపైగా గాయాలు.. బీభత్సం!

ఆఫ్ఘనిస్థాన్ ఉత్తర ప్రాంతాన్ని నవంబర్ 3, 2025 సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదైన ఈ భూకంపం హిందూ కుష్ పర్వత శ్రేణి సమీపంలోని ఖుల్మ్ పట్టణం నుంచి 22-35 కి.మీ. దూరంలో, 23-28 కి.మీ. లోతులో సంభవించింది. స్థానిక సమయం అర్ధరాత్రి 1 గంట (భారత కాలమానం ప్రకారం 1:59 AM)కు భూమి కంపించడంతో వేలాది మంది నిద్రలోనే భయానక అనుభవం ఎదుర్కొన్నారు.

ఈ ఘటనలో పలు నివాసాలు కూలిపోయాయి. సమంగాన్, మజార్, నౌషాద్, తష్కుర్ఘాన్, ఖుల్మ్ ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు కనిపించాయి. కాబూల్-మజార్ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. తష్కుర్ఘాన్‌లో పలు వ్యాపార సముదాయాలు కూలిపోయాయి. ప్రాంప్ట్ అసెస్‌మెంట్ ఆఫ్ గ్లోబల్ ఎర్త్‌క్వేక్స్ ఫర్ రెస్పాన్స్ సిస్టమ్ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.