రేపు తెలంగాణలో BC రిజర్వేషన్ల కోసం సంపూర్ణ రాష్ట్ర బంద్

తెలంగాణలో వెనుకబడిన తరగతులు (BC) హక్కుల సాధన కోసం వివిధ BC సంఘాలు, బీసీ జేఏసీ (బ్యాక్‌వర్డ్ క్లాసెస్ జాయింట్ యాక్షన్ కమిటీ) నడుంబిగించాయి. BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. మొదట అక్టోబర్ 14కు ప్లాన్ చేసిన ఈ బంద్‌ను దసరా పండుగలు, ప్రజా సౌకర్యాల కోసం 18వ తేదీకి మార్చారు.

తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఈ ఉద్యమానికి అనూహ్య బలం చేకూరింది. ప్రధాన ప్రతిపక్షాలైన BRS, BJPతో పాటు వామపక్షాలు (CPI), మావోయిస్టు పార్టీలు కూడా మద్దతు తెలపడంతో దాదాపు అన్ని రాజకీయ శక్తులు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ అరుదైన ఐక్యత BCల రిజర్వేషన్ అంశం యొక్క ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.

BC రిజర్వేషన్ డిమాండ్ వెనుక నేపథ్యం ఇదే..

తెలంగాణలో BCలు జనాభాలో 50% పైగా ఉన్నప్పటికీ, వారికి ఉద్యోగాలు, విద్యలో సమాన అవకాశాలు లభించడం లేదని BC నాయకులు వాదిస్తున్నారు. 76 సంవత్సరాల భారత స్వాతంత్ర్యానికి తర్వాత కూడా BCలు తమ న్యాయమైన వాటాను పొందలేదని, రాజకీయాలు, పరిపాలనలో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42% తెలంగాణ అసెంబ్లీ ఆగస్టు 2025లో పంచాయతీ రాజ్ (అమెండ్‌మెంట్) బిల్, మున్సిపాలిటీల్స్ (అమెండ్‌మెంట్) బిల్‌లు పాస్ చేసింది. G.O. 9 ప్రకారం లోకల్ బాడీల్లో BCలకు 42% కోటా ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు మాట్లాడుతూ.. బీజేపీ రాజ్యసభ ఎంపీ, BC జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. “ఈ ఉద్యమం తెలంగాణకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా BCల న్యాయం కోసం” అని చెప్పారు. “BCలు 76 సంవత్సరాలు అన్యాయానికి గురైనారు. ఈ బంద్ ప్రజల సమస్తులో ఐక్యత చూపిస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ BCలకు 42% రిజర్వేషన్‌కు మొదటి నుంచి కట్టుబడి ఉంది. రిజర్వేషన్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు” అని ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం BCల అభ్యున్నతి కోసం పోరాడుతామని చెప్పారు. ఈ సందర్భంగా BC నాయకులతో గాంధీ భవన్‌లో సమావేశమై మద్దతు ప్రకటించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ K.T. రామారావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ “కాంగ్రెస్ ప్రభుత్వం BC సబ్-ప్లాన్ అమలు చేయడంలో విఫలమైంది. బంద్‌కు పూర్తి మద్దతు” అని ప్రకటించారు. BRS రాజ్యసభ సభ్యులు బిల్లు పాసు అయితే పార్లమెంట్‌లో మద్దతు ఇస్తామని చెప్పారు.

బంద్ ప్రభావం: స్కూళ్లు, కళాశాలలు మూసివేయబడతాయి రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రభావం సంపూర్ణంగా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయి. TSRTC బస్సులు పరిమిత మార్గాల్లో మాత్రమే పనిచేస్తాయి. రైల్వే సేవలు సాధారణంగా ఉంటాయి.

ఈ క్రమంలో బంద్ శాంతియుతంగా జరగాలని BC JAC నాయకులు పిలుపునిచ్చారు. ప్రజలు ట్రావెల్, వర్క్ ప్లాన్ చేసుకోవాలని తెలిపారు.

భవిష్యత్ ప్లాన్లు: నేషనల్ లెవెల్ ఉద్యమంబీసీ జేఏసీ “ఈ బంద్ కేవలం ఒక్కరికి కాదు, BCలందరికీ. అందరూ పాల్గొని విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చింది.