బిహార్ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికలు నవంబర్ మొదటి వారంలో జరగనున్నాయి. రెండు దశల్లో పోలింగ్ ఉంటుంది. మొదటి దశ నవంబర్ 5న. రెండో దశ నవంబర్ 13న. ఇది రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించినది. ఎన్నికల కమిషన్ దీన్ని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో హింస పెద్ద ఎత్తున చెలరేగే అవకాశం ఉంటుందని అక్కడ ప్రజలు
భయపడుతున్నారు. బిహార్ ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ 4.5 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది. 2.5 లక్షల మంది పోలీసులు ఉన్నారు. 470 మంది కేంద్ర పరిశీలకులు పని చేస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాల నుంచి ఐఏఎస్ అధికారులు ఉంటారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ వంటి బలగాల నుంచి లక్ష మంది మోహరించారు. 1200 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వస్తుంది. గయా జిల్లాలో 21 కంపెనీలు ఇప్పటికే ఉన్నాయి. ఇది ఇంతకు ముందు ఎన్నడూ లేని భద్రత. బిహార్ ఎన్నికలు ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఉంటాయి. హింస, నేరాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. నేపాల్ సరిహద్దులోని ఏడు జిల్లాల్లో 21 సీట్లు ప్రభావితమవుతాయి. ఇది ఎన్నికల్లో ఒక సవాలు.
బిహార్ రాష్ట్రం నేరాలకు నిలయం. రాష్ట్ర క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ప్రతి నెలా 229 హత్యలు జరుగుతున్నాయి. రోజూ హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు ఉంటాయి. 2023 ఎన్సీఆర్బీ డేటా ప్రకారం మర్డర్ రేట్ 2.0 పెర్ 100,000. కిడ్నాపింగ్ రేట్ 8.2. రేప్ రేట్ 4.4. మహిళలపై నేరాలు 16.3 శాతం పెరిగాయి 2018-2022 మధ్య. ప్రతి రోజు 953 నేరాలు జరుగుతున్నాయి. అందులో 8 హత్యలు, 33 కిడ్నాప్‌లు, 55 మహిళలపై నేరాలు. నితీశ్ కుమార్ 20 ఏళ్లుగా ముఖ్యమంత్రి. అయినా ఆ రాష్ట్ర నేర చరిత్రలో మార్పు లేదు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని ఒప్పుకుంటున్నారు. అక్కడ న్యాయ వ్యవస్థ కూడా నేరాలను అరికట్టలేకపోతోంది. ఈ రాష్టంలో శాంతి భద్రతల పరిరక్షణ పెద్ద గుదిబండ సమస్యగా ఉంది.
బిహార్ ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రం. పేదరికం 33.76 శాతంగా ఉంది. ఇది దేశంలో అత్యధికం. నీతి ఆయోగ్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం బిహార్ లాస్ట్ ర్యాంక్‌లో ఉంది. తలసరి ఆదాయం దేశ సగటు కంటే తక్కువ. స్థూల దేశీయోత్పత్తి కూడా తక్కువ. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.9 శాతం . దేశ సగటు 3.2 శాతం కంటే ఎక్కువ. మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ చాలా తక్కువ. 60 శాతం జనాభా 30 ఏళ్ల లోపు వారే. వారికి ఉద్యోగాలు లేవు. దీంతో శాంతిభద్రతల సమస్యలు పెరుగుతున్నాయి. లక్షలాదిమంది యువత చిన్నాచితక పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. 74.5 లక్షల మంది బిహారీలు బయట రాష్ట్రాల్లో పని చేస్తుకొని దుర్భరంగా బ్రతుకుతున్నారు.
బిహార్ అభివృద్ధి లేకుండా మిగిలిపోయింది. 20 ఏళ్ల క్రితం లాలూ ప్రసాద్ పాలనలో ఆటవిక రాజ్యం అని బీజేపీ విమర్శించింది. 2005 నుంచి జనతాదళ్ (యు) అధికారంలో ఉంది. 15 ఏళ్లు బీజేపీ భాగస్వామి. అయినా బీహార్ రాష్ట్రం నిరుపేదగానే మిగిలిపోయింది.
సామాజిక అభివృద్ధి, ఆరోగ్యం, విద్య, పాలనలో ఇలా అన్ని విధాలా బిహార్ అధమ స్థానంలో ఉంది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 35 వేల రైల్వే ఉద్యోగాలకు కోసం కోటి మంది అప్లై చేశారు. ఎంపికలో అక్రమాలు జరిగాయని విద్యార్థులు ఆందోళన చేశారు. రైళ్లకు నిప్పు పెట్టారు. కాల్పులు జరిగాయి. ఎన్నికల ముందు పార్టీలు ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇస్తాయి. కానీ అవి నినాదాలుగా మిగులుతాయి. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం బిహార్ లో అత్యధిక పేదరికం, నిరుద్యోగం సమస్యలు ఉన్నాయి. కుల సర్వేలో 94 లక్షల మంది రోజుకు 200 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. 10 వ ,తరగతి పూర్తి చేసుకున్న వారు కేవలం 10 శాతం మాత్రమే.
బిహార్ రాజకీయాలు ఎంత సేపు దారిద్ర్యం, వలసలు, పాలనా వైఫల్యాలు, హింస, కులతత్వం, అవినీతి చుట్టూ తిరుగుతుంటాయి. ప్రజలను ఉచితాలతో మభ్యపెట్టడం అక్కడ సర్వ సాధారణం అయిపోయింది. ఇక్కడ విద్యా వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తోంది. మోదీ ప్రభుత్వం లక్షల కోట్ల ప్రాజెక్టులు పేపర్ పై ప్రకటినలను గుప్పిస్తుంది. కానీ ఆచరణలో అమలైన దాఖలా లేదు. ఉపాధి కల్పన లేదు. బిహార్ రూపురేఖలు గత 15 ఏళ్ళ పాలనలో మారలేదు. దీనికి నితీష్ కుమార్, మోదీ ద్వయమే బాధ్యత వహించాలి. రాజకీయ నిర్లక్ష్యంమే కారణం.
బీజేపీ వారు డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి తెస్తుందని చెబుతారు. లక్షా 26 వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించారు. ఎన్డీఏకు మోదీనే నాయకుడు. బిహార్ ఎన్నికల్లో మోదీ నే కీలకం. బీజేపీ గెలిస్తే మోదీ బలం పెరుగుతుంది. ఓడితే ఇతర శక్తులు బలపడతాయి. బిహార్ రాజకీయాలు కులం చుట్టూ తిరుగుతాయి. కుల లెక్కలు, మత విద్వేషాలు, తాయిలాలు ప్రభావితం చేస్తాయి. వీటిని అధిగమించాలి. అప్పుడే బిహార్ భవిష్యత్ ఉజ్వలం. లేకపోతే ప్రజలు ఎదురుతిరుగుతారు. బిహార్ భారత దేశంలో భాగమే కానీ , పరిస్థితి మాత్రం భిన్నం. 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోంది. జపాన్ను అధిగమించింది. కానీ బిహార్ ను చూస్తే విషాదం కలుగుతుంది. రాజకీయ పార్టీలు,వాటి నేతలు తమ బుద్ధులు మార్చుకోవాలి. ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, భద్రత మెరుగుపరచాలి. అప్పుడే బిహార్ మారుతుంది. ఈ ఎన్నికలు ఒక అవకాశం. ప్రజలు సరైన నాయకులను ఎన్నుకోవాలి.