జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: పొన్నం

TELANGANA: హైదరాబాద్ లోని త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ నిన్న విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని జోరు చేశారు. తాజాగా నేడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలోని వెంగల్ రావు నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించరు. ఈ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, తుమ్మల నాగేశ్వర రావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఏఐసీసీ జూబ్లీహిల్స్ ఇంచార్జి విశ్వనాధన్, అభ్యర్థి నవీన్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతి బూత్ లో ఉన్న ఓటర్లను కలిసి చెప్పండి… 10 ఏళ్ళల్లో ఎవరు రేషన్ కార్డు ఇవ్వలేదు… సన్న బియ్యం ఇచ్చారా…ప్రజలకు చెప్పండి. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న కెసిఆర్ ఎవరికీ డబల్ బెడ్ రూమ్ ఇచ్చారో అడగండి.. ఎంత మందికి రేషన్ కార్డులు ఇచ్చారో ప్రశ్నించండి అని అన్నారు. గత హయంలో అందరిమీద కేసులు పెట్టి వేధించారు. ప్రస్తుతం మీ కుటుంబంపై కవిత చేసిన కామెంట్స్ కు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. సునీత అంటే నాకు సానుభూతి ఉంది.. కానీ అందరి ముందు మైక్ పట్టుకొని ఏడుస్తే విడ్డురంగా ఉంది.

అదేవిధంగా జిల్లా ఇంచార్జ్ మంత్రిగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఆభర్తిగా నవీన్ గెలుస్తున్నాడు.. మీరంతా సపోర్ట్ గా ఉండాలి.. మీరు ఎక్కడ పోయిన కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాలి. ప్రజా పాలన ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నాం. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి విసృతంగా తీసుకోవాలి. ప్రతి ఇంటింటికీ వెళ్లాలి..నవీన్ యాదవ్ గెలుపుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.