తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో టీవీకే ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట అంశం తాజాగా రాజకీయపరంగా తీవ్ర దూమారం రేపుతోంది. ఈ తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉందని అంతేకాదు కొద్దిసేపు కరెంట్ కూడా పోయిందని కీలక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై తమిళనాడు విద్యుత్ బోర్డు స్పందించింది. పవర్ కట్ వార్తలను ఖండించింది.
విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్ నిలిపివేయాలని టీవీకే పార్టీ తమకు లేఖ అందిందని తమిళనాడు విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రాజలక్ష్మి తెలిపారు. సెప్టెంబర్ 27,2025 ఈ రోడ్ లోని వేలుచామిపురం వద్ద భారీ జనసముహం ఉంటుందని పేర్కొంటూ టీవీకే నుంచి లేఖ అందినట్లు చేప్పారు. ప్రజల భద్రతను ద దృష్టిలో ఉంచుకొని విజయ్ ప్రసంగిస్తున్నప్పుడు కొంతసేపు విద్యుత్‌ను నిలిపివేయాలని అందులో కోరినట్లు పేర్కొన్నారు. ఆ అభ్యర్థనను తాము తిరస్కరించినట్లు రాజలక్ష్మి వెల్లడించారు. అయితే, విద్యుత్ కోత కుట్రలో భాగమంటూ టీవీకే వర్గాలు ఆరోపించిన విషయం తెలిసిందే. కొందరు ప్రత్యక్ష సాక్షులు మాత్రం రాత్రి 7 నుంచి 7:30 మధ్య పవర్ కట్ అయినట్లు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని టీవీకే (TVK).. మద్రాస్ హైకోర్టు (Madras High Court) ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
కరూర్‌లో శనివారం రాత్రి నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.