కళల పరిరక్షణే లక్ష్యం

కళల పరిరక్షణే లక్ష్యం కళల పరిరక్షణే లక్ష్యం
కళల పరిరక్షణే లక్ష్యం

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణాన్ని పరిరక్షించాలనే డిమాండ్‌తో తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారం 8వ రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం నృత్య విభాగ విద్యార్థులు నాంపల్లి ప్రాంగణంలో సంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించి వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. భారతీయ కళలు, సంస్కృతికి నిలయమైన ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు తగవని, కళల పరిరక్షణ కోసం నాంపల్లి ప్రాంగణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యార్థులు పేర్కొన్నారు.
దీక్షా శిబిరాన్ని సందర్శించిన అంబేద్కర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వడ్డానం శ్రీనివాస్ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నాలు సమంజసం కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, విద్యార్థులు, మేధావులు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపి, విశ్వవిద్యాలయ పరిరక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమైన ప్రింట్, డిజిటల్ మీడియా న్యాయం వైపు నిలిచి తమ ఉద్యమాన్ని ప్రజలకు చేరవేయాలని విజ్ఞప్తి చేశారు. రామాయణంలో వానరసేనకు వారధి లంకను చేరవేసినట్లే, విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విద్యార్థుల ఆవేదనను ప్రజలకు చేర్చే వారధిగా మీడియా నిలవాలని కోరారు.
గత ఎనిమిది రోజులుగా నిరంతరాయంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నప్పటికీ, ఈ ఉద్యమం ప్రజలకు చేరకుండా కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఒత్తిళ్లకు మీడియా తలవంచకుండా వాస్తవాలను ప్రజలకు, ప్రభుత్వానికి నిర్భయంగా తెలియజేసి న్యాయం జరిగేలా తమ బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం లో విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, కళాకారులు, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతు తెలియజేస్తున్నారు. నాంపల్లి ప్రాంగణాన్ని పరిరక్షించే