భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితులు, ముందస్తు ఏర్పాట్లు మరియు సహాయక చర్యలపై జరిగిన మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశం లో జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెం పాటి, డీసీ సేవా ఇస్లావత్, డీసీ శ్రీనివాస్, సీఎంసి ఇంజనీరింగ్ విభాగం, హైడ్రా , పోలీస్ ,ట్రాఫిక్ ఎన్డీఆర్ఫ్ ,జలమండలి మరియు అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిపిన పియెసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ… నిన్న కురిసిన భారీ వర్షానికి వరదల సమయంలో మ్యాన్హోల్లో పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని, ప్రమాదకర ప్రాంతాలను సురక్షితంగా మార్చాలని, అన్ని శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గల్లంతు అయిన బాలయ్య కొరకు గాలింపు చర్యలను ముమ్మరం చేశాం అని, అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, ప్రతి మ్యాన్ హోల్ నుండి మ్యాన్ హోల్ వరకు క్షణంగా పరిశీలించడం జరిగినది అని, వేగవంతంగా చేసి ఆచూకీ కనుకుంటామని, ఆచూకీ కోసం శాయశక్తుల కృషి చేస్తున్నామని, ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను కొనసాగిస్తామని తెలియచేశారు. వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని , అత్యవసరం తప్పితే బయటకు రాకూడదు అని, అధికారులు కూడా వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, పనులు జరుగుతున్న ప్రాంతాలలో రక్షణ చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యం వహించకూడదు అని తెలియచేశారు.