శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడైన గరుత్మంతుడు

శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడైన గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడైన గరుత్మంతుడు
శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడైన గరుత్మంతుడు

షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్

గరుడ పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు

భక్తిశ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూజలు

ఫరూఖ్‌నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడ పంచమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ గరుడ పంచమి హిందూ సంప్రదాయంలో విశిష్టమైన పర్వదినమని అన్నారు. శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడైన గరుత్మంతుడిని పూజించే ఈ రోజున భక్తులు స్వామివారిని, గరుడ దేవుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారని తెలిపారు. గరుడ పంచమి సందర్భంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
అనంతరం ఆలయ అర్చకులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, నందిగామ మండల పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి గౌడ్, నాయకులు చెంది తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ యాదవ్, కేకే కృష్ణ, సాయి ఈశ్వర్ రెడ్డి, ఒగ్గు కిషోర్, కుమార్ గౌడ్, రాంభూపాల్, జాంగారి రవి, నందిగామ గ్రామ సర్పంచ్ కొమ్ము కృష్ణ, మాజీ కౌన్సిలర్ ప్రతాపరెడ్డి, కానుగు అనంతయ్య, పలభట్ల బాలరాజ్, సీనియర్ జర్నలిస్ట్ మోహన్ రెడ్డి, లింగారెడ్డిగూడ ఉపసర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.