ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యువజన సంఘం నాయకులు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సుక్క రాములు గౌడ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
సుక్క రాములు గౌడ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబంలో ముందుగా అనారోగ్యంతో ఆయన భార్య మృతి చెందగా, కొద్ది రోజులకే కల్లు గీస్తూ చెట్టుపై నుంచి కిందపడటంతో రాములు గౌడ్ కూడా మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పిల్లలు అనాథలుగా మారారు.
ఆ సమయంలో షాద్‌నగర్‌కు చెందిన సర్దార్ పాపన్న గౌడ్ యువజన సంఘం నాయకులు బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చి, షాద్‌నగర్ గౌడ బంధువుల సహకారంతో ఆర్థిక సహాయం అందించారు. ఆ నగదును రాములు గౌడ్ కుమార్తె సుక్క చందన పేరుతో ఆమనగల్ మండలంలోని ఎస్బీఐ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్ తీసుకున్నారు. బాండ్ కాలపరిమితి ముగియడంతో ఆ మొత్తాన్ని తిరిగి చందనకు అందజేశారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహం వద్ద నియోజకవర్గ గౌడ నాయకుల ఆధ్వర్యంలో సుక్క చందనకు రూ.1,00,000 విలువైన చెక్కును అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన యువజన సంఘం నాయకులను పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు ఎడ్ల శ్రీకాంత్ గౌడ్, భానుచందర్ గౌడ్, విజయ్ గౌడ్, అభిలాష్ గౌడ్, రాజేందర్ గౌడ్, జాండ్లగూడెం గోవర్ధన్ గౌడ్, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, నక్కల వెంకటేష్ గౌడ్, కట్ట వెంకటేష్ గౌడ్, పులిమామిడి శ్రీశైలం గౌడ్, పులిమామిడి వెంకటేష్ గౌడ్, పీర్లగూడెం రాజు గౌడ్, బొమ్మ రంగయ్య గౌడ్, రోల్ అంజయ్య గౌడ్, పాలకొండ రజనీకాంత్ గౌడ్, శంకర్, అనిమి రఘు, ప్రేమ్, కంది రఘు, నరసింహ గౌడ్, వరుణ్ గౌడ్, శేఖర్, సుమన్, గోపాల్, నర్సింహా గౌడ్, మహేందర్, శ్రీనివాస్, మణి, సాయి, రఘు తదితరులు పాల్గొన్నారు.