జిల్లా పార్టీ బలోపేతంపై నాయకులతో విస్తృత చర్చ
రంగారెడ్డి జిల్లా బ్యూరో, ఆగస్ట్ 17 (జర్నలిస్ట్ డైరీ) :
హైదరాబాద్లోని గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజక వర్గాల ఇన్చార్జులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వివిధ అంశాలపై జిల్లా నాయకులతో విస్తృతంగా చర్చించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించడం, ప్రజా సమస్యలపై సమిష్టిగా పనిచేయడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యవర్గం ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జి మధు యాష్కీ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కిచెన్నగారి లక్ష్మారెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీమ్ భారత్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, సీనియర్ నాయకులు సిద్దేశ్వర్, గిరిజన విభాగం జిల్లా చైర్మన్ శ్రీను నాయక్, ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ క్యారగారి శ్రీధర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.