భవిష్యత్ భారత ఉపన్యాస చక్రవర్తులను తయారు చేసేలా వాద్ – వివాద్ పోటీలు

AE పౌండేషన్ నిర్వహించిన ఇంటర్-కాలేజ్ డిబేట్ (చర్చల) పోటీ ఘనంగా ముగిసింది. యువత మేధస్సుకు పదును పెట్టేలా సాగిన వాద్ వివాద్-2025 గ్రాండ్ ఫినాలే నవంబర్ 5న బిర్లా ప్లానిటోరియం భాస్కర సభామందిరంలో జరిగింది. ఆగస్టు 29న తొలి ప్రిలిమినరీతో మొదలైన ఈ కార్యక్రమం హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఆలోచనలు, ఉద్వేగం, ఉద్దేశ్యంతో కూడిన ఉద్యమంగా మారింది. దాదాపు 55కు పైగా కళాశాలల నుంచి సుమారు 650 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వాద్-వివాద్‌లో “21వ శతాబ్దంలో భారతదేశం & దాని గుర్తింపును పునర్నిర్వచించడం” అనే ఆలోచనాత్మక థీమ్‌పై చర్చించారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సాగిన ఈ “వాద్ వివాద్” చర్చా పోటీలలో పాల్గొన్న విద్యార్థులు 18 అంశాలపై అనుకూలంగా.. వ్యతిరేకంగా.. తటస్థంగాను చర్చించారు. చర్చల్లో భాగంగా విద్యార్థులు తమ వాదనను బలంగా వినిపిస్తున్నప్పుడు, అంతే విశ్వాసంతో అవతలి వాదాన్ని ఖండిస్తున్నప్పుడు ప్రేక్షకులు వారికి తోడుగా నిలిచి కరతాళ ధ్వనులతో ప్రశంసలందించారు. ఈ పోటీలను నిర్వహించిన AE ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ సంగీతా మిశ్రా మాట్లాడుతూ “చాలా డిబేట్ పోటీలు ఇంగ్లీష్‌లో ఆధిపత్యం చెలాయిస్తుండగా, వాద్-వివాద్ తెలుగులోనూ డిబేట్‌లకు సమాంతర వేదికను అందించడం ద్వారా సమగ్రత కోసం నిలబడింది. దేశ నిర్మాణానికి చర్చలు కీలకం, అయితే మంచి ఆలోచనలు ఉండి, తెలుగులో చక్కగా మాట్లాడగలిగిన అనేక మంది విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. తమ భావాలను వ్యక్తి చేసే అవకాశం ప్రతి గొంతుకకూ లభించేలా వాద్-వివాద్ రూపకల్పన జరిగింది” అని అన్నారు. ఈ ఏడాది చర్చా పోటీలలో పాల్గొనలేదని విచారించొద్దని, వచ్చే ఏడాది జరిగే వాద్-వివాద్ 2026లో పాల్గొనొచ్చని తెలిపారు.

ప్రముఖ సినిమా రచయిత & దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఎన్. విజేంద్ర ప్రసాద్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ మిశ్రా, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నేరెళ్ళ మాల్యాద్రి, డాక్టర్ పల్లవి హరీష్ బాబు, రచనా జర్నలిజం కాలేజీ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరరావు, టెడ్‌ఎక్స్ స్పీకర్ & ఇన్‌ఫ్లుయెన్సర్ సురేష్ కొచ్చాట్టిల్, ఎమ్మెల్సీ & పారిశ్రామికవేత్త మల్కా కొమరయ్య వంటి ప్రముఖులు వాద్ వివాద్ 2025 విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. యువతను చర్చలు, సంభాషణ ద్వారా సశక్తీకరించే AE ఫౌండేషన్ దృష్టికోణాన్ని ప్రశంసించారు. తుది చర్చా పోటీలకు సురేష్ కొచ్చాట్టిల్, ఉమామహేశ్వరరావు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. వాద్-వివాద్ 2025తో AE ఫౌండేషన్ కేవలం చర్చల పోటీలను మాత్రమే నిర్వహించడానికి పరిమితం కాలేదు. స్థిరమైన సామాజిక మార్పు కోసం కట్టుబడి ఉన్న ఈ లాభాపేక్షరహిత సంస్థ మహిళా సాధికారత, విద్య, యువత ఉపాధి, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి లక్ష్యాల సాధన దిశగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా లెర్నిజ్ అనే భవిష్యత్ విద్యా ప్లాట్‌ఫామ్‌ను కూడా ఆవిష్కరించారు. ఇది ఇంటరాక్టివ్ యానిమేషన్స్, ఏఐ-ఆధారిత ప్రశ్నానిధి ద్వారా ఉపాధ్యాయులకు మద్దతు, విద్యార్థులను ఆకర్షించేలా దీనిని రూపొందించారు.

తెలుగులో ‘వాద్ వివాద్’ చర్చల పోటీల్లో విజేతలు:

1వ బహుమతి – 20 వేలు
నాగరాజు – మహాత్మా గాంధీ లా కాలేజీ

2వ బహుమతి – 15 వేలు
శ్రీవిఘ్న తేజ – శ్రేయాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

3వ బహుమతి- 10 వేలు
జే శివప్రసాద్ – నిజాం లా కాలేజీ

ఇంగ్లీష్‌లో ‘వాద్ వివాద్’ చర్చల పోటీల్లో విజేతలు:

1వ బహుమతి – 20 వేలు
చకిలం వరుణ్- ICFAI లా కాలేజీ

2వ బహుమతి – 15 వేలు
వైషక్ – JNTUH

3వ బహుమతి- 10 వేలు
మహసిన్ ఫాతిమా – ICFAI లా కాలేజీ

చర్చా పోటీల్లో విద్యార్థులు చర్చించిన అంశాలు:

భారతదేశ ఆర్థిక శ్రేయస్సు కోసం మహిళల సమాన భాగస్వామ్యం అవసరం

అసహనాన్ని ప్రబోధించే మతాలను సహించకూడదు

పాశ్చాత్య ఆలోచనలు మరియు దృక్పథం మనల్ని మనం ఒక దేశంగా చూసుకునే విధానాన్ని మార్చేశాయి.

ప్రజాస్వామ్యంలో, అన్ని చర్యలను సమర్థించడానికి మెజారిటీ సంకల్పం సరిపోతుంది.

పేదరికం మన దేశ అభివృద్ధికి అతిపెద్ద ముప్పు, ఆర్థిక అసమానత కాదు

భారతదేశం కాగితంపై సెక్యులర్, దాని రాజకీయాల్లో కాదు

డిజిటల్ ఇండియా ఆర్థికంగా అట్టడుగున ఉన్న భారతదేశం

చారిత్రక అన్యాయాన్ని పరిష్కరించకుండా సామాజిక సామరస్యాన్ని సాధించలేము

అక్రమ వలసలు స్థానిక జనాభాపై ఆర్థిక ఉగ్రవాదం

కుల ఆధారిత రాజకీయాలు భారతదేశ సామాజిక-ఆర్థిక పురోగతిని స్తంభింపజేశాయి

అసమర్థ పాలనను దాచడానికి వెల్పేరిజం ముసుగు

విద్య యొక్క లక్ష్యం జ్ఞానోదయం కావాలి, ఉపాధి కాదు

భారతదేశానికి మెరుగైన భవిష్యత్తు కోసం దాని గతాన్ని పునశ్చరణ చేసుకోవాలి

భారతదేశంలో పర్యావరణవాదం ఆర్థిక ఆత్మహత్య

భారతదేశం ఎప్పటికీ అవినీతి రహితంగా ఉండదు

నేరస్థుల దేశం నేరస్థుల పార్లమెంటును ఎన్నుకుంటుంది

ఆధునిక కాలంలో మహిళల భద్రతకు సోషల్ మీడియా అతిపెద్ద ముప్పు

మల్టీ నేషనల్ కార్పొరేషన్లు ఆధునిక ఈస్ట్ ఇండియా కంపెనీలు

1 comments

Comments are closed.