జిల్లెలగూడ పీఎం శ్రీ జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలను సందర్శించిన శ్రీరాములు అందెల

పీఎం పోషణ్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన శ్రీరాములు అందెల పీఎం పోషణ్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన శ్రీరాములు అందెల
పీఎం పోషణ్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన శ్రీరాములు అందెల

పీఎం పోషణ్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన శ్రీరాములు అందెల

విద్యార్థులకు తెలిసేలా పోస్టర్లను పెట్టిన బిజెపి నేతలు

మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్, మీర్‌పేట్ డివిజన్‌లో ఉన్న జిల్లెలగూడ పీఎం శ్రీ జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలను మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ అందెల శ్రీరాములు గారు ఈరోజు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం శ్రీ (PM SHRI – Prime Minister Schools for Rising India) పథకం కింద చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 21 పాఠశాలలు ఎంపికయ్యాయని, వాటిలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ఆరు పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. జిల్లెలగూడ పీఎం శ్రీ జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలకు రెండు సంవత్సరాల కాలానికి రూ.33 లక్షలకు పైగా నిధులు కేటాయించబడినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, సైన్స్ ల్యాబ్‌లు, కరాటే శిక్షణ, క్రీడా సదుపాయాలు, సమ్మర్ క్యాంపులు, సీసీ కెమెరాలు తదితర ఆధునిక వసతులు కల్పించనున్నట్లు వివరించారు. విద్యా రంగ అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న పీఎం పోషణ్ (PM POSHAN) మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆరు రోజుల మెనూను రూపొందించిందని తెలిపారు. వారంలో మూడు రోజులు గుడ్డు, అరటిపండు అందించడంతో పాటు రెండు రోజులు ఆకుకూరలతో కూడిన ఆహారం అందించాలని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్య, పోషకాహారం అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి అధ్యక్షులు తులసి ముకేశ్ ముదిరాజ్, పసునూరి బిక్షపతి చారి, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ పదాధికారులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.