నవాబుపేట మండల సర్పంచి ల సంఘం అధ్యక్ష ఎన్నిక

అధ్యక్షుడిగా కొండల్ యాదవ్ అధ్యక్షుడిగా కొండల్ యాదవ్
అధ్యక్షుడిగా కొండల్ యాదవ్

జులై 7 -నవాబుపేట మండల సర్పంచి ల సంఘం అధ్యక్ష ఎన్నిక, నవాబుపేట్ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా కొండల్ యాదవ్
నూతన సర్పంచ్ లు, మండల నూతన సర్పంచ్‌ల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో మండల సర్పంచ్ లు సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా కావలి కొండయ్య యాదవ్,మరియు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని నూతన సర్పంచ్‌లందరూ కలిసికట్టుగా కావలి కొండయ్య యాదవ్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ల మధ్య సమన్వయం పెంచడం, మండల పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవడం ఈ ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం.
తనను సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుణ్ణిగా ఎన్నుకున్నందుకు కొండయ్య యాదవ్ తోటి సర్పంచ్‌లకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకుంటూ మండల అభివృద్ధికి శ్రమిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.