శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి జన్మదిన వేడుకల లో పాల్గొన్న గాంధీ

శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి జన్మదిన వేడుకల లో పాల్గొన్న గాంధీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి జన్మదిన వేడుకల లో పాల్గొన్న గాంధీ
శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి జన్మదిన వేడుకల లో పాల్గొన్న గాంధీ

వేంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీ లో జరిగిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చాముండేశ్వరీ అనుగ్రహ పీఠాధిపతులు శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి జన్మదిన వేడుకల లో ముఖ్యఅతిథిగా పాల్గొని 200 మంది మహిళ సోదరీమణులకు చీరలను మరియు దుప్పట్లను పంపిణీ చేసిన పియేసి చైర్మన్ ఆరె కపూడి గాంధీ.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ… ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చాముండేశ్వరీ అనుగ్రహ పీఠాధిపతులు శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, ఆయన జన్మదినం పురస్కరించుకొని పలు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తన వంతు సేవలు అందించాలని, ఆ యొక్క సేవలో ప్రతిఫలం వచ్చే తరానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియచేశారు .

ప్రస్తుత సమాజంలో సేవా కార్యక్రమాలకు ఎన్నో ధార్మిక సంఘాలు సహకారం అంది స్తున్నారు అటువంటి ధార్మిక కార్యక్రమాలను ఎన్నో సంవత్సరాలుగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి సేవలందిస్తున్నారని వారి సేవలను భావితరాలను దృష్టిలో ఉంచుకుని వారి మార్గంలో యువత సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆరెక పూడి గాంధీ గారు పిలుపునిచ్చారు. బాలానగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో సివి రామన్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు మహేంద్రవాడ వెంకటేశ్వర అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరు చెడు మార్గాలకు పయనించకుండా మంచి మార్గాల్లో నడుస్తారని అందువల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారు ఎప్పటికీ చెడు మార్గాల్లో ఉండరని అన్నారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు సుమారు 200 మందికి పైగా దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు శ్రీమతి కోట రాజేశ్వరి, భానుమతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు,రాజ్యశ్రీ, పాపిరెడ్డి నగర్ బస్తి అధ్యక్షుడు ఊట్ల చంద్రారెడ్డి, నాయకులు పోతుల రాజేందర్, చెర్ల సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి నర్సింహులు , తాటి కిరణ్, వనం ఆంజనేయులు, మాదాసు అనంత రాములు, సత్యనారాయణ, శ్రీకాంత్, లక్ష్మీ, అరుణ, సులోచన, మనమ్మ తదితరులు పాల్గొన్నారు