నా పేరుతో నకిలీ ఫిర్యాదు చేశారు మాజీ సర్పంచ్ గోపాల్ గౌడ్ ఆవేదన

మాజీ సర్పంచ్ గోపాల్ గౌడ్ ఆవేదన మాజీ సర్పంచ్ గోపాల్ గౌడ్ ఆవేదన
మాజీ సర్పంచ్ గోపాల్ గౌడ్ ఆవేదన

నకిలీ సంతకంతో ప్రోజరీ చేసిన దుండగులు వికారాబాద్ (జర్నలిస్ట్ డైరీ) జులై 07
హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి జూన్ 8, 2026న తన పేరు, నకిలీ సంతకంతో అపరిచిత వ్యక్తులు అక్రమంగా ఒక ఫిర్యాదును సమర్పించారని వికారాబాద్ జిల్లా, నవాబ్‌పేట్ మండలం, అక్నాపూర్ గ్రామం మాజీ సర్పంచ్ జి. గోపాల్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ఫిర్యాదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన అనుమతి లేకుండా, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా తన గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ఈ నకిలీ పత్రాన్ని సృష్టించారని పేర్కొన్నారు. ఈ ఫోర్జరీ వ్యవహారంపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే నవాబ్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో, ఎక్సైజ్ శాఖ అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో తన పేరుతో వచ్చే ఎలాంటి లేఖలు లేదా ఫిర్యాదులనైనా నమ్మే ముందు వాటి నిజానిజాలను పూర్తిగా ధృవీకరించుకోవాలని ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు.