తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల తొలి బోనాల జాతర

తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల తొలి బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల తొలి బోనాల జాతర
తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల తొలి బోనాల జాతర

తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల తొలి బోనాల జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర తొలి బోనాల కమిటీ చైర్మన్ ఆడాల గణేష్ విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు. జాతరను విజయవంతం చేయాలనే లక్ష్యంతో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రాలు అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా గురువారం నాడు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రామిరెడ్డితో పాటు ఇతర ప్రముఖులను కలిసి జాతరకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆడాల గణేష్ మాట్లాడుతూ, కుమ్మరుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే ఈ తొలి బోనాల జాతరను అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు. భక్తులు, కుమ్మరి సంఘ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతర వైభవాన్ని చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు