పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పై అగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ..

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రంగా మారాయి. ఇటీవల ఐసీసీకి సంబంధించిన ఒక కీలక అంశంపై పీసీబీ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా నిన్న జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగ్గా పైనల్లో భారత్ ఘనవిజయం సాధించింది కాగా ఈ క్రమంలో ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వి చేతుల మీదుగా తీసుకోవడానికి నిరకరించింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్, పతాకలతో నఖ్వి అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే నఖ్వి తీరుపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. మన దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వ్యక్తి నుంచి భారత జట్టు ట్రోఫీని స్వీకరించలేదని తెలిపారు. అంతమాత్రాన ఆయన ట్రోఫీని, పతకాలను తన హోటల్‌కు ఎలా తీసుకెళ్తారు..? అంటూ ప్రశ్నించారు. ఇది ఊహించని పరిణామం అని పేర్కొన్నారు. దీనిపై నవంబర్‌ మొదటి వారంలో దుబాయ్‌ వేదికగా జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయంపై గట్టిగా నిరసన తెలుపుతామని ఆయన వెల్లడించారు. నఖ్వీ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు‌. అంతేకాదు పాక్‌ అంతర్గత మంత్రి కూడా. దీంతో ఆయన తీరు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.