ఆస్ట్రేలియాతో వన్టే సిరీస్… టీమిండియా వన్డే కొత్త కెప్టెన్ గా ఏవరంటే!

ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియా కొత్త కెప్టెన్‌గా శుభ్మన్ గిల్ (Shubman Gill)ను నియమించిన బీసీసీఐ. అదే విధంగా ఆస్ట్రేలియా(India Vs Australia)తో జ‌రిగే వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు చెందిన భార‌తీయ జ‌ట్టును ప్ర‌క‌టించారు. ఇక టీ20 సిరీస్ మ్యాచ్‌ల‌కు సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌ధ్య బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తాడు. ఆస్ట్రేలియా, ఇండియా మ‌ధ్య మూడు వ‌న్డేలు, అయిదు టీ20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. అక్టోబ‌ర్‌-న‌వంబ‌ర్ నెల‌ల్లో ఆ మ్యాచ్‌లు ఉంటాయి. సీనియ‌ర్స్ మెన్స్ సెల‌క్ష‌న్ క‌మిటీ భార‌త బృందాన్ని ఎంపిక చేసింది. అయితే వ‌న్డేల్లో సీనియ‌ర్ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీకి ఛాన్స్ ద‌క్కింది. ఆ ఇద్ద‌ర్నీ ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇక వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను శ్రేయాస్ అయ్య‌ర్‌కు అప్ప‌గించారు. వ‌న్డేల‌కు వికెట్ కీప‌ర్‌గా కేఎల్ రాహుల్ ఎంపిక‌య్యాడు. వ‌న్డే టీమ్‌లో నితీశ్‌, సుంద‌ర్‌, కుల్దీప్‌, హ‌ర్షిత్ రాణా, సిరాజ్‌, అర్ష‌దీప్‌, ప్ర‌సిద్ధ కృష్ణ‌, ద్రువ్ జురెల్ , జైస్వాల్ కూడా ఉన్నారు.

ఆసీస్‌తో జ‌రిగే టీ20 సిరీస్‌కు సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌ధ్య బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. ఆ జ‌ట్టులో అభిషేక్ శ‌ర్మ‌, గిల్‌, తిల‌క్ వ‌ర్మ‌, నితీశ్‌, శివ‌మ్ దూబే, అక్ష‌ర్ ప‌టేల్‌, జితేశ్ శ‌ర్మ‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, బుమ్రా, అర్ష‌దీప్‌, కుల్దీప్ యాద‌వ్‌, హ‌ర్షిత్ రాణా, సంజూ సాంస‌న్, రింకూ సింగ్‌, సుంద‌ర్ ఉన్నారు. అయితే వ‌న్డే జ‌ట్టుకు స్పీడ్ ఔల‌ర్ బుమ్రాను ఎంపిక చేయ‌లేదు.