తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ (ఖానాపూర్ గేట్ సమీపం)లో నవంబర్ 3, 2025 సోమవారం ఉదయం 5 గంటల సమయంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి (NH-163)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన తెలంగాణ ఆర్టీసీ బస్సు (తాండూరు నుంచి హైదరాబాద్కు వెళ్తూ)ను ఎదురుగా వచ్చిన కంకర లోడు టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న బలం వల్ల టిప్పర్ బస్సు పైనే బోల్తా పడి, కంకర మొత్తం బస్సు లోపలికి పడిపోయింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు నూజ్జైంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 24 మంది (బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ సహా). వీరిలో 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక 3 నెలల చిన్నారి & 15 నెలల పాప ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమం. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి, వికారాబాద్, హైదరాబాద్ గాంధీ & ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. అయితే బస్సులో మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రమాద కారణాలు..
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. రాంగ్ రూట్లో, అతి వేగంతో (ఓవర్ స్పీడ్) వచ్చి ఢీకొట్టాడు. దీంతో రోడ్డు ఇరుకుగా ఉండటంతో టిప్పర్ పూర్తిగా బస్సుపై పడిపోయింది. కాగా ఈ రోడ్డు NH-163లో 46 కి.మీ. విస్తరణ పనులు ఇంకా పూర్తి కాలేదు. రెండు వైపులా వాణిజ్య కార్యకలాపాలు, గుంతలు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణం. ఈ మార్గం “మృత్యు కుహరం”గా మారిందని స్థానికులు ఆవేదన.
ప్రస్తుతం మూడు జేసీబీలతో కంకర తొలగించి ప్రయాణికులను బయటకు తీశారు. రెస్క్యూ సమయంలో చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కాలిపై జేసీబీ వెళ్లి తీవ్ర గాయాలు. అదే విధంగా సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు (నంబర్లు: 9912919545, 9440854433) ఏర్పాటు చేశారు.ఈ రోడ్డు ప్రమాదం నేపథ్యంలో చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు.