తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలకు పడుతున్నాయి. గత నాలుగు రోజులు కాస్తా బ్రేక్ తీసుకున్న వర్షాలు, నిన్నటి నుంచి మళ్లీ తిరిగి దంచికొడుతున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం వల్ల ఈ వర్షాలు కొనసాగుతాయి. గత రాత్రి హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, ఆరాంఘర్, మైలదేవర్పల్లి, చాంద్రాయణ గుట్ట బిఎన్ రెడ్డి, గుర్రంగూడ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో రోడ్లు చెరువులుగా మారాయి. ట్రాఫిక్ జామ్, వాటర్ లాగింగ్ సమస్యలు తలెత్తాయి.
ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు..
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ద్రోణి వల్ల ఏపీలో మరో వారం (అక్టోబర్ 7 నుంచి 14 వరకు) తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. IMD ప్రకారం, ఉత్తరాంధ్రలో ఎక్కువగా ప్రభావం పడుతుంది. 40 కి.మీ./గం. వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. తీరప్రాంతం, రాయలసీమ, తమిళనాడు, కొమరిన్ వరకు ప్రభావం. వర్షాలు, పిడుగులు, మెరుపులు కలిసి వాటర్లాగింగ్, పొర్లు, ట్రాఫిక్ సమస్యలకు దారితీస్తాయి. ఈ వ్యవస్థ అక్టోబర్ 3 నాటికి తీరాన్ని తాకవచ్చని, తర్వాత బలహీనపడుతుందని IMD తెలిపింది.
ఏపీలో రెడ్ అలర్ట్ జిల్లాలు..
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి. ఇక్కడ ప్రజలు ఇంటి వద్దే ఉండాలి, ప్రయాణాలు మానుకోవాలి. APSDMA రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో ఎల్లో అలర్ట్ జిల్లాలు..
నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల. ఇక్కడ అక్కడక్కడ వర్షం పడే చాన్స్ ఉంది.
మత్స్యకారులు, రైతులకు సూచనలుతుఫాను ముప్పు తప్పినా, పౌర్ణమి సమయంలో సముద్రంలో ఆటు పోట్లు ఎక్కువ. చిన్న పడవలతో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి.