ప్రస్తుతం తెలంగాణ లో జూబ్లీహిల్స్ ఎన్నికలు మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే లోకల్ బాడి ఎలక్షన్స్ లో హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలకు జోరుగా ప్రచారం జరుగుతుంది. కాగా ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల మధ్య పంచాయతీలు తార స్థాయికి చేరుతున్నాయి. గత నాలుగు రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దున్నపోతుల పంచాయతీ హట్ టాపిక్ మారింది. ఈ తరుణంలో తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దళిత మంత్రికి క్షమాపణలు చెప్పడంతో ఆ పంచాయతీ సద్దుమనిగింది.
మరోవైపు ఇది ముగిసిన వారం రోజులు గడవకముందే మరో ఇద్దరు మంత్రుల పంచాయతీ తెరలేపింది. అయితే ఆ ఇద్దరు మంత్రులు ఎవరంటే కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ క్రమంలో ఇదే విషయంపై మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్‌కు ఫిర్యాదు చేసిన మంత్రి కొండా సురేఖ. అంతేకాకుండా నేడు కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం.
ప్రస్తుతం ఇద్దరి మధ్య టెండర్ల పై వార్ కొనసాగుతుంది. ప్రస్తుతం మేడారం పనులకు సంబంధించిన టెండర్లలో ఇంచార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకున్నాడని కొండా సురేఖ ఆరోపించింది. తన దేవాదాయ శాఖకి సంబంధంచిన రూ.71 కోట్ల టెండర్ని తన మనిషికి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడని వాపోయారు. అన్ని తానై నడిపిస్తున్న పొంగులేటి.. ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సురేఖ. ఈ క్రమంలో తన శాఖలో పొంగులేటి జోక్యం చేసుకోవడంపై ఎందుకని కొండా ఆగ్రహం.. అందుకే సీఎంకు ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నరు. ఈ నేపథ్యంలో ఈ మంత్రుల పంచాయతీ తెలంగాణ కాంగ్రెస్ ఏ విధంగా మాట్లాతాదో చూడాలి.