పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకలైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తక్షణమే పునరుద్ధరించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొడంగల్ మండల ఎమ్మార్వో కార్యాలయంలో డిప్యూటీ ఎమ్మార్వోకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోల దామోదర్, 2వ వార్డు కౌన్సిలర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్, తెలంగాణ ఉద్యమకారుడు ఏర్లపల్లి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.
2014 అక్టోబర్ 2న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధత కల్పించి యథావిధిగా కొనసాగించాలి. ఎన్నికల్లో ఇచ్చిన తులం బంగారం హామీని నెరవేర్చకుండా పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నేతలు ఆరోపించారు. పథకాలను పునరుద్ధరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు, ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ నవాజ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, మల్లేష్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ శివకుమార్ సింగ్, నాయకులు రవీందర్ చారి, వెంకట్, చిన్నయ్య, మంగలి శేఖర్, రాజశేఖర్, హనుమంతు, శివరాజ్, హకీమ్, రాఘవేందర్ రెడ్డి, శరణప్ప, పరమేష్, అమ్మి బాయ్, కాశమ్మ, అంజమ్మ, మధు, చింటూ, రవి తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లను వెంటనే అమలు చేయాలి