కనీసం పేదింటి “కళ్యాణమైన” జరిపించండి..
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ డిమాండ్
షాద్ నగర్ ఆర్డిఓ కార్యాలయం ఎదుట బిఆర్ఎస్ ధర్నా – ఆందోళన
ఆందోళనకు పెద్ద ఎత్తున తరలివచ్చిన బిఆర్ఎస్ శ్రేణులు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదింటి ఆడపడుచుల కళ్యాణానికి తులం బంగారం ఇస్తామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఏకంగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లకే ఎసరు పెడుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ విమర్శలు గుప్పించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించడం దీనినీ ఎత్తివేయకుండా ప్రభుత్వం సంసిద్ధంగా లేకపోవడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే అంజయ్య ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్డిఓ కార్యాలయం ఎదుట భారత రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ధర్నాకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. “నూరు అబద్దాలైన ఆడి ఒక పెళ్లి చేయాలని” ఆనాడు పెద్దలు నానుడి అంటూ ఉండేవారని పేద ఇంటి పిల్లలకు పెళ్లి చేయడానికి కన్న తల్లిదండ్రులు పడుతున్న తాపత్రయం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 2014లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 51 వేల రూపాయల పారితోషకంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి బృహత్తరమైన పథకాలను ప్రవేశపెట్టారని, అలాగే పేదల అవసరాలకు అనుగుణంగా వారి ఇబ్బందులు గుర్తించి వాటిని లక్ష రూపాయలకు పైగా కేటాయించారని గుర్తు చేశారు. కళ్యాణ లక్ష్మి పై ఎవరో హైకోర్టులో రెడ్ పిటిషన్ వేగా కోర్టు ఐదు సందర్భాలలో ప్రభుత్వాన్ని సంజయ్సీ కూరగా ప్రభుత్వ లీడర్ ఎవరు తగువిధంగా స్పందించలేదని అంజయ్య యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పేద ప్రజల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఎతివేసేందుకు కుట్ర చేస్తుందని అందుకే ఉన్నత న్యాయస్థానానికి సమాధానం చెప్పుకోలేకపోయిందని అందుకే ఈ పథకాలపై స్టే విధించడం జరిగిందని అంజయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నో ప్రగల్బాలు పలికారని రెండున్నర సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి పాలన కొనసాగుతున్న తులం బంగారం ఇవ్వకపోగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి బృహత్తర పథకాలను ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలు సామాజిక అంశంతో ముడిపెట్టి చూడాలని అంజయ్య యాదవ్ ప్రభుత్వానికి అప్పీల్ చేశారు. ఎందుకంటే పేద కుటుంబాల్లో ఆడపిల్లలు కన్న తల్లిదండ్రులకు భారం అని భావించి ఆడపిల్లలను అంగట్లో అమ్మివేస్తున్నారని చదువులు చదివిపించడం లేదని ఇలాంటి సమయంలో ఆడపిల్ల పుట్టగానే కెసిఆర్ ప్రభుత్వం ఆనాడు కెసిఆర్ కిట్ ద్వారా 13 వేల రూపాయలు ఇస్తుందని ఆ తర్వాత విద్య తదితర పథకాలలో ప్రాధాన్యత ఇస్తుందని పెళ్లి చేసి పంపే వరకు కళ్యాణ లక్ష్మి అందజేస్తుందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య గుర్తు చేశారు. ఆడపిల్ల కోసం గత ప్రభుత్వం ఎంతో తాపత్రయపడి వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అనేక పథకాలు రూపొందించింది అని గుర్తు చేశారు. ప్రభుత్వం కోర్టు అంశంలో వెంటనే స్పందించి విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. లేనియెడల పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రజలను చైతన్యవంతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్, మాజీ మహిళ స్త్రీ శిశు సంక్షేమ రీజినల్ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాల్ నాయక్, మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ పీఎసీఎస్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వివిధ మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ యువత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.