హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ లో జాతీయ రహదారి పై పాదచారుల సంరక్షణ కొరకు నూతనంగా నిర్మించబోయే పాదచారుల పైవంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం కొరకు స్థలంను తాజా మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు మరియు సీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించిన పియెసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ”
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ… హైదర్ నగర్ డివిజన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త అని, ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తీరుననీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి కల సాకారమైన వేళ అని, చిరకాల ఆకాంక్ష నెరవేరిన శుభదినం అని, హైదర్ నగర్ జాతీయ రహదారి నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డు అని, ప్రమాదాలు జరుగునని, పాదచారులకు రోడ్డు దాటడం కష్టంగా ఉండునని, హైదర్ నగర్ పరిసర ప్రాంత ప్రజలకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుంది అని, పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటడానికి అన్ని హంగులతో సకల సౌకర్యాలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలియచేశారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వలన వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రజలకు రక్షణ కల్పిస్తుంది అని, వేగంగా వెళ్లే వాహనాల మధ్య రోడ్డు దాటే ప్రమాదాలను తగ్గిస్తుంది అని, జనాల రాకపోకల వల్ల రోడ్లపై ఏర్పడే ట్రాఫిక్ జామ్లను తగ్గిస్తుంది.అని , వృద్ధులు, దివ్యాంగుల కోసం మెట్లతో పాటు లిఫ్ట్లు లేదా రాంప్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలియచేశారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని, ప్రజలకు అన్ని హంగులతో , సకల సౌకర్యాలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనుల పై అధికారులకు పలు సలహాలు , సూచనలు ఇవ్వడం జరిగినది . ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వలన రోడ్డు దాటే పాదచారులకు, వృద్దులకు ఎంతగానో తోడ్పడుతుంది అని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో డిఈ శ్రీదేవి, డిఈ కార్తీక్, ఏఈ యుగేందర్ మరియు నాయకులు, కార్యకర్తలు హైదర్ నగర్ వాసులు తదితరులు పాల్గొన్నారు.