విద్యార్థుల ప్రోత్సాహానికి నారాయణరెడ్డి కృషి అభినందనీయం

విద్యార్థుల ప్రోత్సాహానికి నారాయణరెడ్డి కృషి అభినందనీయం విద్యార్థుల ప్రోత్సాహానికి నారాయణరెడ్డి కృషి అభినందనీయం
విద్యార్థుల ప్రోత్సాహానికి నారాయణరెడ్డి కృషి అభినందనీయం

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

తన తల్లి తిరుపతమ్మ స్మరణలో విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన వంకాయల నారాయణరెడ్డి

బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి తన మాతృమూర్తి కీ.శే. వంకాయల తిరుపతమ్మ జ్ఞాపకార్థం షాద్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రథమ, ద్వితీయ బహుమతులుగా నగదు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు వంకాయల నారాయణరెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, తమ తల్లిదండ్రులకు, గురువులకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని అంజయ్య యాదవ్ ఆకాంక్షించారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని, ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. తన మాతృమూర్తి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వంకాయల నారాయణరెడ్డి విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నారని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ శ్రేణులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తిరుపతమ్మ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.