షాద్ నగర్ పట్టణంలో శివాజీ చౌక్ దగ్గర విజయ్ ఆచార్య,మరియు సుకుమార్ ఏర్పాటు చేసిన విజయ్ జువేళర్స్ మొదటి వార్షికోత్సవ వేడుకలకు ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మొదటి వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన బంగారు,వెండి ఆభరణాలను అందిస్తూ విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు విజయ్ జ్యువెలర్స్ యజమానులను,ఆయన ప్రత్యేకంగా అభినందించారు.భవిష్యత్తులో ఈ సంస్థ మరిన్ని శాఖలతో విస్తరించి,కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్సీ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ అనిత రఘునాథ్ యాదవ్, వాణి పాండురంగ రెడ్డి,అశోక్ యాదవ్,మాజీ కౌన్సిలర్లు యుగేందర్,చిన్న యాదగిరి,చెన్నయ్య,కాంటెస్టెడ్ కౌన్సిలర్ సలీం,మహాదేవ్ పూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి,మామిడిపల్లి మాజీ ఎంపిటిసి కాట్న రవీందర్,మొదల్లగూడ మాజీ సర్పంచ్ నాగర్ కుంట ఉమా ప్రవీణ్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు రఘుపతి రెడ్డి,ఆశ్రప్,రమేష్ గౌడ్,వెంకట్ రెడ్డి,క్రిష్ణ గౌడ్,దినేష్ సాగర్,శివా చారి,నర్సింగ్,అఖిబ్ తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంటూ వ్యాపారంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి