గౌడ కుల వృత్తిని నీరుగారుస్తున్న రెవంత్ రెడ్డి ప్రభుత్వం

గౌడ కుల వృత్తిని నీరుగారుస్తున్న రెవంత్ రెడ్డి ప్రభుత్వం గౌడ కుల వృత్తిని నీరుగారుస్తున్న రెవంత్ రెడ్డి ప్రభుత్వం
గౌడ కుల వృత్తిని నీరుగారుస్తున్న రెవంత్ రెడ్డి ప్రభుత్వం

రాష్ట్రంలో గౌడ క్కల వృత్తిని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీరు గారుస్తుందని, గౌడులను రాజకీయంగా సమాధి

చేస్తుందని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దొంగు వెంకటేష్ గాడ్ అన్నారు. ఆదివారం ఎల్బీనగర్ లో ఏర్పటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహుజన రాజ్యాధికార పోరాట వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ జయంతి అధికారికంగా ప్రకటించి జనగామ జిల్లాని పాపన్న జిల్లాగ నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. పాపన్న గౌడ్ జీవిత చరిత్రను పాఠశంలో చేర్చాలని ప్రభుత్వాని కోరారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో గౌడ వృత్తి చేసుకుంటు ప్రమాదవశాత్తు మరణించిన వృత్తివారులకు. కాలు డేతులు విరిగిన ప్రమాద బాధితులకు రూ. 17 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయని వెంటనే నిధులు మంజురు చేయాలని డిమాండ్ చేశారు. గౌడలకు కోకాపేట్లో రూ. 5 కోట్లతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భవనం శంకుస్థావర చేసి ఉన్నది. పాషన్న గౌడ్ జయంతి సందర్భంగా రూ.50 కోట్ల రూపాయలు విడుదల చేసి వెయిటనే పనులు ప్రారంభించే విదంగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. గౌడ కార్పొరేషన్ కి నిధులు కేటాయించి గౌడ కులస్తులకు కల్లుగీత వృత్తిదారులకు నిధులు అందే విధంగా చూడలని అన్నారు. కంఠం మహేశ్వర కవచ మోకులు కల్లు గీత వృత్తిదారులకు రెండు లక్షల మోఫైలు, కల్లుగీత వృత్తిదారులకు వైర్స్ లో ప్రభుత్వం హమీ ఇచ్చిన విధంగా 25% వాటా కల్పించి పాపన్న జయంతి ఉత్సవాలాలో ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.