నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన పియేసి చైర్మన్

నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన పియేసి చైర్మన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన పియేసి చైర్మన్
నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన పియేసి చైర్మన్

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ, శంషిగూడ, పిజెఆర్ నగర్ కాలనీలలో రూ.3 కోట్ల 29 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే స్మశాన వాటిక అభివృద్ధి పనులు, పార్క్, బతుకమ్మ పార్క్, టాయిలెట్ బ్లాక్ నిర్మాణం పనులకు తాజా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన పియేసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ… ప్రజల సంక్షేమం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం మరియు కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ, శంషిగూడ, పిజెఆర్ నగర్ కాలనీల లో రూ.3 కోట్ల 29 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే స్మశాన వాటిక అభివృద్ధి పనులు, పార్క్, బతుకమ్మ పార్క్, టాయిలెట్ బ్లాక్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది అని, స్మశాన వాటిక అభివృద్ధి నిర్మాణం పనులకు, పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీ వాసులకు ఉపశమనం లభించింది అని తెలిపారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని , శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అగ్రభాగాన నిలబెడుతామని తెలిపారు. సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన , అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని తెలియచేసారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని , నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని ప్రజలకు ట్రాఫిక్ రహిత , సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని PAC చ చెప్పడం జరిగినది.

ఎల్లమ్మబండ లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతామని, స్మశాన వాటిక ను అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామని, దహన వాటిక, స్నానపు గదులు, విశ్రాంతి గదులు నిర్మిస్తామని, చుట్టు పరారీ గోడ ను నిర్మిస్తామని , అన్ని హంగులతో సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని, చివరి దశలో దహన సంస్కారాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియచేశారు.

పార్క్ లను సంరక్షించి,అభివృద్ది చేసి ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని ఆరోగ్య శేరిలింగంపల్లి నా ధ్యేయం అని, ప్రతి కాలనీ లో, పార్క్ లలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తామని, ఓపెన్ జిమ్ ల ద్వారా ప్రతి రోజు వ్యాయమం చేసుకోవడానికి ఎంతగానో తోడ్పడుతాయి అని, వృద్ధులకు, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని అన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, ఆల్విన్ కాలనీ డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు

  1. ఎల్లమ్మబండ లో రూ.135.00 లక్షల తో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటిక ప్రహారీ గోడ నిర్మాణం మరియు అభివృద్ది పనులకు
  2. PJR నగర్ కాలనీ లో రూ. 101.50 లక్షల తో బతుకమ్మ పార్క్ అభివృద్ది మరియు సుందరీకరణ నిర్మాణం పనులకు
  3. PJR నగర్ కాలనీ లో రూ. 61.50 లక్షల తో పార్క్ సుందరీకరణ మరియు అభివృద్ధి నిర్మాణం పనులకు
  4. శంషిగూడ లో రూ. 31.00 లక్షల తో టాయిలెట్ బ్లాక్ నిర్మాణం పనులకు

పైన పేర్కొన్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు,మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు